Friday, 31 July 2026 05:52:37 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రామసముద్రం లో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు

Date : 11 January 2026 07:42 PM Views : 1220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 11 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రం మరియు నరసాపురం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని గడ గడలాడించిన వడ్డేఓబన్న 219 జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు, ఉదయం 11గంటలకు నరసాపురం గ్రామం, ఎంపిడిఓ కార్యాలయం,మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలహారాలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించి బానాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నరసాపురం గ్రామంనుండి వందలాది మంది వడ్డేర కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీ గా మండల కేంద్రానికి తరలి వచ్చి అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి జై ఒడ్డెర ఓబన్న జైభారత్ అంటూ నినాదాలు చేశారు.ఓబన్న జయంతి సందర్బంగా పలువురు మాట్లాడుతూ వడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాటం చేసి తొలి స్వాతంత్ర సమరయోధుడుగా వడ్డెర ఓబన్న కు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరమన్నారు. అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభుత్వకార్యాలయాలలో ఆయన జయంతి ఉత్సవాలను జరపడం సంతోషకరమన్నారు. వడ్డెర ఓబన్న స్వాతంత్ర సమరంలో సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాడిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఎంతోమంది తెల్లదొరల ప్రాణాలను తీసి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహాయోధుడని కొనియాడారు.అదేవిధంగా వడ్డెర కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.నరసాపురం గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఆధ్వర్యంలో ఒడ్డెర ఓబన్న చిత్రపటానికి పూజలు చేసి బాణాసంచాలు కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఓబన్న జయంతి వేడుకల్లో అశేషంగా వడ్డెర కులబాందవ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి నరసాపురం గ్రామస్తులు గొప్ప అన్నదానకార్యక్రమం నిర్వహించారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: