Thursday, 30 July 2026 10:17:00 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి - స్పెషల్ ఆఫీసర్ వెంకటరత్నం

Date : 20 December 2025 08:32 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 ః తంబళ్లపల్లె మండలంలో అధికారులు తమ శాఖల పనితీరుపై చొరవచూపి సమస్యల పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా పీడి వెంకటరత్నం సూచించారు. శనివారం ఆయన మండలంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ఏపీ డి నందకుమార్ రెడ్డితో కలిసి ఎర్రసాని పల్లెలో ప్రకృతి వ్యవసాయం పంట సాగును పరిశీలించి ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పెంచాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి ప్రతి జాబ్ కార్డు కలిగిన వ్యక్తికి పని కల్పించాలన్నారు. అనంతరం తంబళ్లపల్లె సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించి స్వామిత్వ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే పై ఆరా తీసి పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని హెచ్చరించారు. అనంతరం మల్లయ్య కొండ కింద పండ్ల తోటల ప్లాంటేషన్, కరువు పనులు పరిశీలించారు. అనంతరం మల్లయ్య కొండ శివాలయంలో మహా శివుని దర్శించి పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటరమణ, పద్మావతి, భాస్కర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: