Thursday, 30 July 2026 03:00:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ - కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

Date : 14 April 2026 12:33 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భాతర రాజ్యాంగ రూపశిల్పిగా, సమానత్వమే ఊపిరిగా ప్రపంచ దేశాల ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్వక్తి అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరో జీవితాలలో మార్పునకు స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దామని నినాదాలు చేశారు. అనంతరం రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహనీయునికి స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జయంతి జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ దార్శనికుడుగా పేరుపొందిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మహనీయుడు అన్నారు.‌ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనలో అందరూ భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాజీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ రెడ్డి, టౌన్ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నిమ్మనపల్లి మండల మాజీ బీసీ అధ్యక్షులు ఆర్ నాగరాజు, మదనపల్లి పట్టణ మాజీ సెక్రెటరీ మహమ్మద్ అలీ, జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మదనపల్లి టౌన్ మాజీ బీసీ ఉపాధ్యక్షులు పాలేటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ నాయక్, సమీర్, వెంకటరమణ, భయారెడ్డి, సమీవుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :