Monday, 03 August 2026 06:06:26 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు

Date : 11 June 2026 10:21 PM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ సర్వే పై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లయ్య కొండ మహాశివుడు స్థిరపడిన కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దీనిపై అధిష్టానంతో మాట్లాడి మైనింగ్ చర్యలు ఆపడానికి సహకరించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర కు తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య కొండల్లో గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ కు అనుమతి ఇచ్చి లక్షలాదిమంది ప్రజల ఆందోళన కార్యక్రమాలు, మైనింగ్ చేపడితే జరిగే అరిష్టాలు కూలంకషంగా మంత్రికి వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాయకులు మల్లయ్య కొండ చరిత్ర ఆలకించి మల్లయ్య కొండ మైనింగ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మల్లయ్య కొండ మైనింగ్ పై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబులు సైతం మల్లయ్య కొండ సమస్య సున్నితమైనదని ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తొలుత రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, టిడిపి రాష్ట్ర బిసి ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు లను ఘనంగా సన్మానించి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దదిక్కు లేక గ్రూపులు తయారై కార్యకర్తలు దిక్కులేని వారిగా తయారయ్యారని ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: