నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 19 : జేసీబీ పనుల చేసే సమయం లో బంగారం దొరికిందని నమ్మబలికి, అత్యవసరం రిత్యా తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను నమ్మించి నిర్మానుష్యం మైన ప్రాంతం లో మార్పిడి చేసే క్రమంలో కత్తుల తో బెదిరించి డబ్బులు కాజేసి ముఠా లోని ఏడు మంది ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.8కేజీ ల బంగారం పూసల దండ, నకిలీ బంగారం అభరణాలను, టాయోట కారు ను, రెండు కత్తులు లను రెండవ పట్టణం పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించిన డిఎస్పీ పావని. వీరు పాత ముద్దాయి లేనంటూ, వీరిపై గతం లో రెండు కేసులు ఉన్నట్లు, సాధారణ వాహన తనిఖీలలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని విచారించిగా అసలు విషయం వెల్లడించిన ముద్దాయిలు, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పీ పావని
Reporter
Namitha News