నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 20 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు రాంనగర్ మున్సిపల్ పాఠశాల నందు శనివారం యోగ డే సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు కళావతి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాసనాల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే చిన్న తనం నుండే యోగా చేయడం అలవర్చుకోవాలని,చిన్నతనం నుంచే యోగాసనాలు అలవర్చుకోవడం వలన విద్యార్థులు విద్యను అభ్యసించడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వీలవుతుందని అన్నారు.యోగ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత,సతీష్,చిన్న రెడ్డప్ప, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News