నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 : తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సింగమానుబురుజుకు చెందిన పాపి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం తంబళ్లపల్లె ఎస్ ఎల్ వి కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి వైకాపా రచ్చబండ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హాజరవుతారని నియోజకవర్గంలోని వైకాపా సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాటర్ షెడ్ చైర్మన్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
Reporter
Namitha News