నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 22 : పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు ప్రాంతం రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. మృతుడు బీ.సీ.వై. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కు వై ప్లస్ కేటగిరి భద్రత లోని సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ 33సంవత్సరాల చెన్నారెడ్డి గా గుర్తింపు, మృతుడు చెన్నారెడ్డి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పొదరాళ్ళ పంచాయతీ రేగడ కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి రంగారెడ్డి కుమారుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు అర్బన్ పోలీసులు, మృతదేహన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు. ఆత్మహత్య కు గల కారణాలు, వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది
Admin
Namitha News