Friday, 31 July 2026 02:32:16 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ మంజునాథ్ బాబు జన్మదిన వేడుకలు.

Date : 04 December 2025 03:11 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ మంజునాథ్ బాబు జన్మదిన వేడుకలు.. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం మరియు చిన్నారులు ఉపాధ్యాయుల బృందం డాక్టర్ మంజునాథ్ ని కరతాల ధ్వనుల మధ్య పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. తదుపరి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను మరియు పిల్లలు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధుల యోగక్షేమములను డాక్టర్ మంజునాథ్ కి వివరించారు. తదుపరి భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకులు పేటీఎం శివన్న మాట్లాడుతూ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇప్పటివరకూ జరిగిన, 19 ఉచిత గుండె వైద్య శిభిరాల్లో... సుమారు 6000 మందికి, 5000/- రూపాయల విలువ చేసే పరీక్షలు ఉచితంగా చేసి, గుండె జబ్బులున్నట్లు నిర్ధారణ కాబడిన 626 మందికి ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసి, ప్రాణాలు కాపాడి, ప్రాణదాతగా పిలువబడుతున్న, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ మంజునాథ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భారతీయ అంబేద్కర్ సేన సలహాదారులు రిటైర్డ్ ఎంఈఓ రెడ్డప్ప , మరియు రిటైర్డ్ జైలర్ లక్ష్మీనారాయణ జ్ఞాపికను అందజేశారు.. డాక్టర్ మంజునాథ్ బాబు కర్ణాటక రాష్ట్రం, కోలార్ RL జాలప్ప మెడికల్ కాలేజ్ లోని "నారాయణ హృదయాలయ వారి హార్ట్ సెంటర్" నందు ప్రముఖ గుండె వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారని ఆయనను కొనియాడారు. తదుపరి డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యత హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తదుపరి డాక్టర్ మంజునాథ్ కేక్ ని కట్ చేసి పిల్లలకు పంచి పెట్టడంతో పాటు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ 15 కేజీల కందిపప్పు మరియు పదివేల రూపాయలు వితరణ చేశారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి డాక్టర్ మంజునాథ్ కి, మరియు నారాయణ హృదయాలయ బృందానికి సంస్థ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు ఆనంద వృద్ధాశ్రమ వృద్ధులు మరియు ఉపాధ్యాయ బృందం, బాస్ కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: