నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహమ్మద్ ఖాన్ విద్యా సేవలు ప్రశంసనీయం....జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు *మహమ్మద్ ఖాన్ కు ఉర్దూ సేవా పురస్కారం* *మహమ్మద్ ఖాన్ విద్యా సేవలు ప్రశంసనీయమని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు,మన దేశ తొలి విద్యా శాఖా మంత్రి, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం రాయచోటి లో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలలో విద్యా వికాసానికి, ఉర్దూ విద్య బలోపేతానికి మహమ్మద్ ఖాన్ అనేక సేవలను అందించారని కొనియాడారు. హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మస్తాన్ బి లు మాట్లాడుతూ....మహమ్మద్ ఖాన్ అటు విద్యా రంగానికి ఇటు సాహితీ ప్రపంచానికి చేస్తున్న కృషి ని ప్రశంసించారు. అనంతరం ఆయన కు దుశ్శాలువ, జ్ఞాపిక తో పాటు ఉర్దూ సేవా పురస్కారం తో సత్కరించారు.*
Reporter
Namitha News