నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 14 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ ) విభాగం వారు "డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్" అనే అంశం పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సప్తగిరి ఏలుమలై, సీనియర్ నెటవర్క్ & సెక్యూరిటీ లీడ్, ఆల్ఫా డేటా ఎల్.ఎల్.సి, అబుదాభి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో డీప్ లెర్నింగ్ మోడల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఆధునిక సైబర్ దాడులు క్రమంగా సమస్యాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు మాత్రమే సరిపోవని, సమస్యలను ముందుగా గ్రహించగలిగే మేధస్సు కోసం డీప్ లెర్నింగ్ మోడల్స్ కీలకమని తెలిపారు. న్యూరల్ నెట్‌వర్క్‌లు, LSTM, CNN, ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, దాడులను ముందే అంచనా వేసి భద్రతను పెంపొందిచవచ్చని అన్నారు. ఈ సాంకేతికతలు క్రమబద్ధమైన డేటాను సమర్థవంతంగా విశ్లేషించడానికి మరియు అంచనా వేయడానికి రూపొందించబడింది అని, దీని సహాయంతో నెట్‌వర్క్ ట్రాఫిక్‌లో కనిపించే నమూనాలు, అసాధారణ ప్రవర్తనలు, కొత్తగా ఉద్భవించే సైబర్ ముప్పులను గుర్తించడం చాలా సులభం అవుతుందని అన్నారు. కంప్యూటర్, మొబైల్, అప్లికేషన్‌లలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించి హ్యాకర్లు దాడి చేయకుండా ఉండేందుకు యాంటీవైరస్, ఫైర్వాల్ సాఫ్ట్‌వేర్‌లను మరియు పాస్వర్డ్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా సైబర్ దాడులను అరికట్టవచ్చని అన్నారు. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని, ఇటువంటి ఆధునిక సాంకేతిక శిక్షణలు వారి భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్స్ వి.శివరామన్, ఎన్.గీతాంజలి, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News