నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో ఏపీ ఈజీపీఎస్ఎస్ ప్రప్రథమ సమావేశం గ్రాండ్ సక్సెస్ - రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లికార్జున హర్షం - రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన గిరిజన ప్రముఖులు మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,చిత్తూరు బస్టాండ్ సమీపంలోని టౌన్ హాల్ నందు ఆదివారం ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రథమ రౌండ్ టేబుల్ సమావేశం దిగ్విజయంగా ముగిసింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డి.ఎస్.పి వరప్రసాద్,దేవరకొండ శంకరరావు,వీరం సత్యం,నాగేంద్ర సోహనాలు,నాగేంద్ర నాయక్,బ్యాంక్ మేనేజర్ కోనయ్య,ఉపాధ్యాయుడు గోపాల్,చలపతి,కోనేటి రామంచులు,ప్రసాద్,సూర్యప్రకాష్,రమేష్,శేఖర్ రాష్ట్రంలోని ఎరుకుల,యానాది,బంజారా,ఎస్టి కులస్తులు,ప్రముఖ నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణ కోసం ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం ముందుంటుందన్నారు.తమ కులాలకు చెందిన కులస్తులు,ఉద్యోగస్తులు,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.అనర్హులకు అందజేసిన ఎస్టీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని,నకిలీ గిరిజన కుల సర్టిఫికెట్లను జారీ చేస్తున్న కుల సంఘాలను రద్దు చేయాలని కోరారు.గిరిజనులకు కేటాయించిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమగ్రంగా విచారణ చేసి,పేద దళిత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు.రాష్ట్రంలోని ఎస్టీ హాస్టల్లో గిరిజనుల విద్యార్థుల సంరక్షణ విషయమై ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని,రాష్ట్ర బడ్జెట్లో ఐటిడిఏలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు.యానాది కులస్తులను ప్రభుత్వం గుర్తించాలని,వారి ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని విన్నవించారు.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎస్టీలకు ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయించాలని,ప్రతి జిల్లాలో ఎస్టీ భవన్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం తొలి సమావేశం దిగ్విజయంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు జరుపుకుంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిర్విరామ కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసిన గిరిజన ప్రముఖులు,అతిరథ మహారథులు,గిరిజన ముద్దుబిడ్డలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమన్నారు.
Reporter
Namitha News