నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - డిసెంబర్ 26 : సాధారణ బదిలీ పై వచ్చి పదవి బాధ్యతలు చేపట్టిన తంబళ్లపల్లె యస్.ఐ. అనిల్ కుమార్ ను తంబళ్లపల్లె మండలం లోని టిడిపి నేతలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత టిడిపి ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర ఆధ్వర్యంలో యస్.ఐ. ను దృశ్యాలవులు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించగా ఆయన స్పందించి అందరి సహకారంతో నేర రహిత మండలంగా తయారు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ రెడ్డి, సోమశేఖర్, మీసాల భాస్కర్ నాయుడు, శివరాం,జయరామిరెడ్డి, ధన శేఖర్, జగదీష్, భాస్కర్,రామచంద్ర, శ్రీనివాసులు, ఆనంద రెడ్డి, జనసేన నాయకులు మురళి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News