నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 ః తంబళ్లపల్లె మండల మారుతీ ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆటో యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా మోహన్, వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా వి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా ఆనంద్, ప్రసాద్ కోశాధికారిగా చిన్నాలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. మీ సమస్యల పరిష్కారానికి సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రికార్డులతో పాటు లైసెన్స్ కలిగి అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి క్షేమంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్లు, సిఐటియు సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News