Friday, 31 July 2026 10:43:44 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డి.యం.హెచ్.ఓ. లక్ష్మీనరసయ్య

Date : 04 February 2026 07:17 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం -- డిఎమ్హెచ్ఓ లక్ష్మీనరసయ్య క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయం నుండి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పై అవగాహనా సమావేశం నిర్వహించారు.‌ డిఎమ్హెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనసైలి, ప్రవర్తన తో క్యాన్సర్ ను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఏడాది దాదాపు 35 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే గత ఏడాది నవంబర్ 15 నుండి ఇంటింటి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఎన్సీడి 4.0 నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎన్. సి. డి. ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివప్రతాప్ మాట్లాడుతూ "ఒకే లక్ష్యం ఎన్నో కథలు" "మేమున్నామని మీకేమి కాదని" అని ఈ ఏడాది థీమ్ ను ఎంపిక చేశామన్నారు. గుట్కా, పోగాకు, మద్యపానం సేవించడం, ఎక్కువగా గర్భ నిరోధక మాత్రలు మింగడం వల్ల, వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుందన్నారు. కొన్ని జన్యు సంబంధ కారణాల వల్ల, ఊభకాయం వల్ల, క్రిమిసంహారక మందులు వాడటం, ఆహారంలో రసాయణాలు వాడటం వల్ల, వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 14ఏళ్లు నిండిన అమ్మాయిలకు భవిష్యత్ లో గర్భషయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఇమ్మ్యూనిటీ పెంచడానికి హెచ్. పీ. వి. వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, తొందరలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని, ఆరోగ్య కరమైన జీవనశైలీ పాటిద్దాం, ప్లాస్టిక్ ను నిషేదిద్దాం, క్యాన్సర్ ను నివారిద్దాం, క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి అవగాహన పెంచుకుందాం, వదిలేద్దాం జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, చక్కర, మైదా, ఆయిల్, కారం తగ్గించుకుందాం క్యాన్సర్ ను నివారిద్దాం అంటూ నినాదాలు పట్టణ పురవీధుల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జ్ణానాంబికా డిగ్రీ కళాశాలలో ప్రపంచ కాన్సర్ దినం పై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక, ఏ. ఓ. మధుసూదన్ రెడ్డి, 104నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, డి. ఎమ్. ఓ. రామచంద్ర రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. కాన్సర్ పై అవగాహన ర్యాలీ చేస్తున్న వైద్యసిబ్బంది క్యాన్సర్ ను నివారిద్దామని ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యసిబ్బంది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :