Thursday, 30 July 2026 07:50:27 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి - ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్ర పిలుపు

Date : 29 November 2025 06:54 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి - క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి - ఏఐసిసి అన్నమయ్య జిల్లా అబ్జర్వర్ మహేంద్ర పిలుపు - పార్టీకి పూర్వ వైభవానికి సమిష్టిగా కృషిచేయండి - ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ సూచనలు మదనపల్లె : కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడంతోపాటు 2029 ఎన్నికల్లో విజయానికి ఇప్పటి నుండే అడుగులు వేద్దామని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అన్నమయ్య జిల్లా అబ్జర్వర్ మహేంద్ర పేర్కొన్నారు.శనివారం స్థానిక పుంగనూరు రోడ్డు నందు గల జెసిఎం కమ్యూనిటీ హాల్ నందు మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు నిగార్ సుల్తాన అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్ర,సెక్రటరీ గణేష్ యాదవ్,డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే బాషా,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్,యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొండుపల్లి ఆనందలు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ఇందులో భాగంగా డిసిసి అధ్యక్షులు ఎంపిక కోసం పారదర్శకంగా పార్టీలో అందరి అభిప్రాయాలను సేకరించి,నివేదికను రాహుల్ గాంధీకి అందజేయడం జరుగుతుందని ప్రకటించారు.రాష్ట్రంలో టిడిపి మరియు జనసేన ప్రతిపక్ష వైకాపా కూడా బిజెపి ఏజెంట్లేనని ఎద్దేవా చేశారు.2029 శాసనసభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్లెల పవన్ కుమార్ రెడ్డేనని వెల్లడించారు.ఏఐసీసీ సెక్రటరీ గణేష్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం కానీ గ్రామం కానీ లేదన్నారు.స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉన్నదో,తిరిగి అదేవిధంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు.డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ మాట్లాడుతూ ఇకపై నియోజకవర్గ ఇన్చార్జ్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని,ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడుతారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ చైర్మన్ ఆవుల అది,మీనా కుమారి,కలిచెర్ల మస్తాన్ రెడ్డి,ముబారక్ ఖాన్,ఖాదర్ బాషా,మహబూబ్ పీర్,మహమ్మద్ అలీ,మహమ్మద్ రఫీ,ఈశ్వరమ్మ,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :