నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : టీనేజీ ఆడపిల్లల సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు నిఘా పెంచి అప్రమత్తంగా ఉండి కీలక పాత్ర పోషించాలని ఏఎస్ఐ నజీర్ భాష సూచించారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఏపిఎం గంగాధర్ ఆధ్వర్యంలో శక్తి యాప్ పై మహిళలకు అవగాహన జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ మహిళలు తమ పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీం సభ్యులు ముని కుమార్ నాయక్, శశికళ లు టీనేజీ వయసులో ఆకర్షణలకు నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్టడీస్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్లో ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటి పట్ల అప్రమత్తత, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు వల్ల జరిగే దుష్ప్రభాలు, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అందుబాటులోకి వచ్చిన శక్తి యాప్ ఉపయోగాలను మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 1930,112,1098 టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రామచంద్రారెడ్డి, దండువారి పల్లి రమణ, నారాయణ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి మహిళలు పాల్గొన్నారు
Reporter
Namitha News