నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 59 వేల అక్రమ మద్యం సీజ్ - కేసు నమోదు - నిందితుల అరెస్ట్ చేసి రిమాండ్ - రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ నరేష్ రాళ్లబుదుగూరు పి.ఎస్ పరిధిలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల బుదుగూరు పోలీసులు శాంతిపురం విజయ లాపురం రోడ్డులోని బడుగుమకులపల్లి గ్రామం, శాంతిపురం మండలంలో ఎల్. జయరాం రెడ్డి నివాసం సమీపంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఘటనను గుర్తించడం జరిగిందని రాళ్లబుదు గూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఐ. నరేష్ తెలిపారు.ఇందులో భాగంగా అదే రోజు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడినదన్నారు. ఇందులో నిందితులుగా బి. సురేష్ బాబు ( 30 ), బి. శ్యామలమ్మ వెంకటప్ప (45), అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. సీజ్ చేసిన దాంట్లో జాన్స్ ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ (90 మి.లీ), 960 టెట్రా ప్యాకెట్లు (రూ.48,000/-), అమృత్ సిల్వర్-కప్ రేర్ ఇండియన్ బ్రాండీ (90 మి.లీ), 279 సాచెట్లు (రూ.11,160/-) వి మొత్తం111.5 లీటర్లు, రూ.59,160 విలువైన మద్యం సీజ్ చేయబడిం దన్నారు. ఈ మద్యం కర్ణాటక రాష్ట్రంలోని గుండిశెట్టిపల్లి వైన్ షాపుల నుండి అక్రమంగా సేకరించి, లైసెన్స్ లేకుండా అక్రమంగా విక్రయానికి ఆటో లో రవాణా చేయబడుతొందని తెలిపారు.మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి, మద్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.
Reporter
Namitha News