Friday, 31 July 2026 10:46:19 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

సంక్రాంతి సంబరాల్లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దంపతులు

కుల, మతాలకు అతీతంగా, ప్రశాంత వాతావరణం లో పండుగను జరుపుకోవాలి - జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి

Date : 12 January 2026 09:05 PM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : జనవరి 12: రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి , వారి సతీమణి శ్రీమతి ఉమా శ్రీ లక్ష్మీ లు కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నిత్యం కవాతులు, శిక్షణలతో కనిపించే పోలీస్ మైదానం, సంక్రాంతి సందడితో ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సంక్రాంతి అనేది ఒక కులానికో, మతానికో పరిమితమైన పండుగ కాదని, ఇది శ్రమజీవులైన రైతుల పండుగ అని కొనియాడారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన శుభవేళ, అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు పోలీసు సిబ్బందిలో విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ గారు ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే పేదలు, మహిళలు, వృద్ధులు మరియు బడుగు బలహీన వర్గాల పట్ల అత్యంత మానవీయంగా వ్యవహరించాలి. పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, చట్టాన్ని అతిక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా మహిళా పోలీసులు మరియు పోలీసు కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు (ముగ్గులు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గుల పోటీలను ఎస్పీ గారి సతీమణి శ్రీమతి ఉమా శ్రీ లక్ష్మీ గారు ప్రారంభించి, విజేతలను ఎంపిక చేశారు. మ్యూజికల్ చైర్స్, డ్రాయింగ్ పోటీలు, తంబోలా, గోళీలు, బొంగరాల వంటి ఆటలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు స్వయంగా పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, అందరిలో ఉత్సాహాన్ని నింపారు. వేడుకల చివరలో వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి మరియు వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు వి.జె.రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఇతర పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, హోంగార్డులు మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను చిరస్మరణీయం చేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :