Friday, 31 July 2026 12:47:37 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రాష్ట్ర మంత్రులను కలిసిన నాగూర్ వలి

Date : 10 December 2025 06:10 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర మంత్రులను కలిసిన నాగూర్ వలి మదనపల్లె : రాష్ట్ర రోడ్డు రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ లని మదనపల్లె ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శీనా) మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ మంత్రులు తనను ఎంతో ఆప్యాయంగా పలకరించారన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం,డిపోలలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.ఆయన సానుకూలంగా స్పందించి ఏపీఎస్ఆర్టీసీ సంస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారన్నారు.మైనార్టీల అభ్యున్నతికి తగినన్ని నిధులు కేటాయిస్తూ అన్నివిధాల అండగా నిలుస్తామని తెలిపారన్నారు.మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని,మంత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: