Thursday, 30 July 2026 10:16:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఘనంగా ఎన్.సి.సి. దినోత్సవం

Date : 23 November 2025 10:22 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె - నవంబర్ 23 : మదన3 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆదివారం ఉదయం 77 వ యన్.సి.సి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ పాల్గొని యెన్.సి.సి జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ 1948 లో స్థాపించబడిన యెన్.సి.సి భారతదేశంలోని యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మరియు కర్తవ్య భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది అని అన్నారు. ఐక్యత తో, క్రమశిక్షణ తో అందరు కట్టుబడి ఉండాలని, స్నేహభావం తో ముందుకు సాగాలని క్యాడెట్స్ తో అన్నారు. ప్రతి క్యాడెట్ సేవా దృక్పథం కలిగి ఉండాలని దేశానికి సమస్య వచ్చినప్పుడు ఓ సైనికుడిలా పనిచేయాలని ఆయన అన్నారు. యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ 2024-2025 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ ఇన్స్టిట్యూట్ గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గుర్తింపు రావడం, గుజరాత్ లో జరుగుతున్న జాతీయ స్థాయి రాక్ క్లైంబింగ్ క్యాంపులో యూనివర్సిటీ యెన్.సి.సి విద్యార్థి రాణిస్తున్నాడని మరియు ఢిల్లీ లో జరిగిన తల్ సైనిక్ క్యాంపు నందు పాల్గొన్న విద్యార్థులు వివిధ విభాగాలలో వెండి పథకాలు సాధించినట్లు ఈ సందర్బంగా తెలియజేశారు. అంతేకాకుండా 2026వ సంవత్సరం ఢిల్లీలో జనవరి లో జరిగే గణతంత్ర దినోత్సవ పెరడ్ లో కూడా మిట్స్ యూనివర్సిటీ నుండి ఒక విద్యార్థి పాల్గొన్నే అవకాశం ఉందని అయన తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :