Thursday, 30 July 2026 12:55:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ధాత్రి ఫౌండేషన్ ను సందర్శించి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించిన సేవారత్న డాక్టర్ మురుగన్

*ఘన స్వాగతం పలికిన ధాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి*

Date : 05 June 2026 02:54 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *ధాత్రి ఫౌండేషన్ ను సందర్శించి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించిన సేవారత్న డాక్టర్ మురుగన్* *ఘన స్వాగతం పలికిన ధాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి* పలమనేరు: మండలం గంటాపూర్ బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ సేవారత్న డాక్టర్ మురుగన్ నేడు మదనపల్లి ధాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి ఆహ్వానం మేరకు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి వారి టీం ఘనంగా స్వాగతం పలికారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అవ్వ తాతలు మురుగన్ ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ, సామాజిక సేవ చేసి భక్తి మార్గంలో పయనిస్తున్న సేవా రత్న డాక్టర్ మురుగన్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఒక సేవా కార్యక్రమంలో కలిసినప్పుడు ఫౌండేషన్ ఒకసారి విజిట్ చేయమని చెప్పి కోరిన వెంటనే ఆయన రావడం మాకు ఎంతో సంతోషం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ వెళ్లాలని కోరారు. డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ, దాత్రి ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఆనంద నిలయంలోకి రావడంతో ఇక్కడున్న అవ్వ తాతలను చూస్తే నాకు మా అవ్వ తాతలు గుర్తుకొచ్చారు ఎంతోమంది వృద్ధులు తమ కుటుంబీకుల ప్రేమానురాగాలు కొందలేక వీధిన పడుతున్నారు అలాంటివారిని అక్కున చేర్చుకుని వారికి తన కుటుంబ సభ్యుల మాదిరి మూడు పూటలా అన్నం పెట్టి వారి బాగోగులు చూస్తున్నటువంటి దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణిని ఎంత పొగిడినా తక్కువే, మీ అందరికీ ఒక కుమార్తె లాగా ఆమె చేస్తున్న సేవ ఎంత చెప్పినా తక్కువే, ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ధాత్రి ఫౌండేషన్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ ను అవ్వ తాతలు ఆప్యాయంగా పలకరించి భావోద్వేగానికి గురయ్యారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :