నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు ఏమాత్రం అలసత్వం వహించరాదు, చట్ట పరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' లో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకిస్తూ, ఫిర్యాదులు స్వీకరిస్తూ తక్షణమే విచారణ జరిపి, న్యాయం అందించాలని సంబంధిత అధికారులను ఫోన్ లో ఆదేశించిన అడిసిషనల్ ఎస్పీ. మీరు తీసుకున్న చర్యల నివేదికను వెంటనే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా కేంద్రానికి రాలేకపోయిన ప్రజలు తమ ఫిర్యాదులను దగ్గరలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాలలో కూడా ఇవ్వవచ్చని, వాటిని కూడా 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ఫిర్యాదులుగానే పరిగణించి, సకాలంలో న్యాయం అందిస్తామని అదనపు ఎస్పీ వేంకటాద్రి తెలియచేసారు
Admin
Namitha News