Thursday, 30 July 2026 11:17:49 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నేరస్థులకు శిక్షే లక్ష్యం గా సాక్షులను సకాలంలో హాజరుపరచాలి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ

Date : 24 March 2026 07:52 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 24 : బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చడంలో కోర్టు కానిస్టేబుళ్లు వారధిలా పనిచేయాలని, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడటమే ప్రథమ కర్తవ్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారు స్పష్టం చేశారు. మంగళవారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో డీసీఆర్బీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ సిబ్బందితో ఎస్పీ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా హత్యలు, మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు (పోక్సో), మత్తు పదార్థాల రవాణా (ఎన్.డి.పి.ఎస్) వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. "నిందితుడికి శిక్ష పడినప్పుడే బాధితుడికి నిజమైన న్యాయం జరిగినట్లు" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ సమయంలో సాక్షులు భయం లేకుండా వాంగ్మూలం ఇచ్చేలా వారికి రక్షణ కల్పించి, విచారణ సమయానికి వారిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాలని ఎస్పీ ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసే సమన్లు, బెయిలబుల్ మరియు నాన్-బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న వారెంట్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. దేశంలో నూతనంగా అమల్లోకి వచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాల పట్ల ప్రతి కానిస్టేబుల్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కొత్త నిబంధనల ప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని సూచించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం సంబంధిత కేసులలో సీసీ నంబర్లను తీసుకునేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, కేసు వివరాలను విధిగా సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం వృత్తిపరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ, కేసుల పురోగతిని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ కె. దస్తగిరి, పలువురు ఎస్ఐ లు, కోర్టు లైజనింగ్ అధికారులు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: