నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : మనిషి పుట్టుక నుండి చచ్చేంత వరకు రెవిన్యూ శాఖ కీలకమని ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే అవకాశం రెవిన్యూ అధికారులకు రావడం హర్షనీయమని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రెవిన్యూ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ప్రతి ఫైల్ వెనుక ఒక కుటుంబం, ఒక జీవితం ఉంటుందని గ్రహించి రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా స్పందించి సమస్య పరిష్కరిస్తూ వారు మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూ డే సందర్భంగా ఆయన మండల కార్యాలయ సిబ్బంది, విఆర్వోలు, వీఆర్ఏలు, రైతులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
Reporter
Namitha News