Friday, 31 July 2026 01:52:27 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పల్లె లల్లో అలుముకుంటున్న కరువు చాయలు

జీవన భృతి కల్పించాలి బి.కె.యం.యు. జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 16 July 2026 02:54 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 16 : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పుంగనూరు మండల సమితి సమావేశం నేడు స్థానిక ముడెప్ప సర్కిల్లో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప , ఎఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్నా పాల్గొని వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి చెమ్మ లేక తాగినీటి బోర్లు వ్యవసాయ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక కరువు ఛాయాల్లో అలుముకుంటున్నాయని ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర ధరలు కూలీలు దొరక్క ఆదాయం లేక జీవన పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయని అందుకోసమే వలసల నివారణ కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతికూలికి పని కల్పించి రోజు కూలి 700 రూపాయలు చెల్లించాలని మట్టి పనులు చెరువు గట్టు పనులు వర్షాలు లేక గట్టితనం ఉండడం వల్ల పనులు చేయలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని కనుక పని చేసినా చేయకపోయినా జీవించటానికి జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతులు దీర్ఘకాలిక రోగిగ్రస్తులు వెయ్యి కళ్ళతో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం మొండి చేయి మాత్రమే చూపిస్తున్నది. అలాగే ఈనెల 24వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరుగుతున్నదని ఈ సమావేశంలో వ్యవసాయ కూలీలు పేదలు దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రతి వ్యవసాయ కూలీలకు మూడెకరాలు ప్రభుత్వ మిగిలి భూమి పంపిణీ చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలని పేదలకు ఇవ్వాల్సిన భూములు బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్తున్నారని పేదలు కడుపుకొట్టేటువంటి అసైన్డ్ చట్ట సవరణ 9/77 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మా భాష, అరుణ్ కుమార్, ఏఐటియుసి పట్టణ నాయకులు వాసు, ఫయాజ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :