Friday, 31 July 2026 10:42:03 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

తంబళ్లపల్లె మండల అభివృద్ధికి సమిష్టి కృషి చేద్దాం - ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి

తంబళ్లపల్లె మండలం మీట్ లో ఎంపీపీ శ్యామల

Date : 12 March 2026 08:26 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 12 : తంబళ్లపల్లె మండలాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతో సమిష్టి కృషి చేద్దామని ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి కోరారు. గురువారం ఎంపీపీ మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ మండలంలోని సబ్స్టేషన్ల పరిధిలో లోవోల్టేజ్ సమస్యలను అధిగమించామని, భవిష్యత్తులో విద్యుత్ సమస్య లకు ప్రత్యామ్నాయంగా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు పై సభ్యులకు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించామని అదేవిధంగా డ్రైనేజీలు,మరుగుదొడ్లు, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పి ఆర్ ఏఈ,రమణ మాట్లాడుతూ తంబళ్లపల్లె లో కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని రెండవ దశలో మండల పరిధిలో పనులు చేపడతామన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మండలంలో గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో చేసిన పొరపాట్లు సరిదిద్ది పక్కాగా పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయడంతో పాటు జాయింట్ ఎల్ పి ఎం తోపాటు పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. సిడిపిఓ సుజాత అంగన్వాడి సెంటర్లకు అందజేస్తున్న గర్భిణీలు,బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై సభకు వివరించారు. ఏపీవో అంజనప్ప వి బి జి రాంజీ ఉపాధి హామీ నూతన చట్టంలోని ఉపయోగాలను తెలియజేశారు. ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి ఆర్టీసీ అందిస్తున్న సేవలను5 వివరించి సభ్యులు అడిగిన సమస్యలకు పరిష్కార హామీ ఇచ్చారు. ఐకెపి ద్వారా సంఘాలకు అందిస్తున్న రుణాలు, సద్వినియోగం పై సీసీ రమణ వివరణ ఇచ్చారు. మండలంలోని పాఠశాలల్లో విద్యా విధానం, నిర్వహణ తదితర అంశాలపై సీఆర్పీ సుధాకర్ విశదీకరించారు. కాగా మండలంలోని ఇరిగేషన్,హార్టికల్చర్, సిరికల్చర్, ఆర్ అండ్ బి, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు గైర్హాజర్ కావడం విశేషం. ఈ మండల మీట్లో ఏవో థామస్ రాజా, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకలరెడ్డి, కూటమి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి,భేరి శ్రీనివాసులు,తులసీ ధర్నాయుడు, రామచంద్ర, పురుషోత్తం, ఎద్దుల నరసింహులు,ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు ఎస్సైలు ప్రతాప్, శ్రావణి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :