Tuesday, 09 June 2026 09:46:11 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు

Date : 31 December 2025 05:17 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు - హాజరైన ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ బాషా - కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్లేకార్డుల ప్రదర్శన - వేలాదిగా తరలివచ్చిన ప్రజలు,విద్యార్థి,యువత,మహిళలతో కిక్కిరిసిన పుర వీధులు మదనపల్లె : మదనపల్లి కేంద్రం గా జిల్లా ఆవిర్భావమైన శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం.షాజహాన్ భాషా ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.స్థానిక పుంగనూరు రోడ్డులోని మిషన్ కాంపౌండ్ నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీకి మదనపల్లె నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,స్వచ్ఛంద సేవా సంస్థలు,ప్రజలు,విద్యార్థులు,మహిళలు,యువత హాజరై పాలుపంచు కున్నారు.దశాబ్దాల కలగా మిగిలిన మదనపల్లి ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున మహిళలు,స్వచ్ఛంద సంస్థలు, తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,ప్రజలతో కలిసి ర్యాలీ ముందుకు సాగింది.ఇందులో భాగంగా మిషన్ కాంపౌండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా వాల్మీకి సర్కిల్,టౌన్ బ్యాంక్ సర్కిల్,అవెన్యూ రోడ్డు,బెంగళూరు బస్టాండు అనిబిసెంట్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ముందుకు సాగింది.ఇందులో భాగంగా అని బిసెంటుకు మదనపల్లి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచ్చేసి,ప్రదర్శనలో భాగస్వాములు కావడం జరిగింది.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ బాషాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని,దశాబ్దాల కల మదనపల్లె జిల్లా కలను నెరవేర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు.చారిత్రాత్మక మదనపల్లె జిల్లా ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమన్నారు.మదనపల్లి,తంబళ్లపల్లి,పీలేరు,పుంగనూరు నియోజకవర్గ వర్గాల ప్రజలకు ఒక పండుగ రోజన్నారు.నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మదనపల్లి జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని ప్రజల తరఫున వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్,1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్,ఆర్.జె.వెంకటేష్,జంగాల వెంకటరమణ,రెడ్డి షంషీర్,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),బొమ్మిశెట్టి పురుషోత్తం,యర్రబల్లి వెంకటరమణారెడ్డి,మోడెం సిద్ధప్ప,రాటకొండ శ్రీనివాస నాయుడు,కొరముట్ల నాగరాజు,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు తలారి రాధమ్మ,బీదం గురునాథ్ యాదవ్,జీవి నాయుడు,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,జెసిబి వేణు,బాలమాలి శేఖర్,రెడ్డి రాయల్,మంజునాథ్ పెద్దసంఖ్యలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :