Thursday, 30 July 2026 10:59:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆంధ్రుల ఆత్మగౌరవం రాజధాని అమరావతి

Date : 02 April 2026 09:17 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రుల ఆత్మగౌరవం " అమరావతి" : -- చట్టబద్ధతతో రాష్ట్ర రాజధానిగా అమరావతి -- అడుగడుగునా హర్షం వ్యక్తం చేస్తున్న కూటమి నాయకులు, ప్రజలు నిమ్మనపల్లి: ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరావతికి నేడు చారిత్రాత్మక విజయం లభించిందని టిడిపి మండలాధ్యక్షులు రాజన్న, మాజీ జడ్పిటిసి వసంతా మునిరత్నం సింగల్ బండ అధ్యక్షులు కోట రమణ జనసేన పార్టీ నాయకులు సురేష్ అన్నారు. గురువారం నిమ్మనపల్లి బస్టాండ్ కోడలలో కూటమి నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఎంపిక చేసి పార్లమెంటులో చట్టబద్ధతను కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే షాజహాన్ భాష చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంత మునిరత్నం సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ జనసేన పార్టీ నాయకులు సురేష్ మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి సుమారు 12 సంవత్సరాలు కావస్తుందన్నారు. కట్టు బట్టలతో బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే బస్సులో ఉంటూ ప్రజలకు సుపరిపాలన అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని గుర్తుచేశారు. రాష్ట్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాలకు పైగా తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించి అమరావతిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వానికి వారు సహకరించడం జరిగిందన్నారు. విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ పెట్టుబడులను తీసుకువచ్చి రాజధానిని నిర్మించడానికి కృషి చేస్తుంటే, అనూహ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అమరావతికి గ్రహణం పట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటలతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశారన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మహిళలు, రైతులు, పిల్లలు, విద్యార్థులు ఎంతోమంది న్యాయ పోరాటం చేస్తూ, పాదయాత్రలతో దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటే అడుగడుగునా వారిని ఆడవారని కూడా చూడకుండా చిత్రహింసలు చేశారన్నారు. ప్రజల దీవెనలతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు అమరావతిని శాశ్విత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలోనే అమరావతికి శాసనసభలో, పార్లమెంటులోని ఉభయ సభల్లో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసి రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ ను విడుదల చేయించడానికి కృషి చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధతకు ఎన్డీఏ మిత్రపక్షాలు ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయన్నారు. భూములు దానం చేసిన రైతుల కళ్ళల్లో నేడు ఆనందం చూస్తున్నామని తెలిపారు. అయితే వైఎస్సార్ సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైనా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా అమరావతికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా లేకుండా మార్చేస్తానంటున్నారని అన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. మరో 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ పరిపాలనే కొనసాగుతుందని తెలిపారు. అమరావతికి చట్టబద్ధతతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం జరుగుతుందని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామిక అభివృద్ధితో ఉద్యోగ, వ్యాపార కల్పన పెంపొందించవచ్చున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతకు అమరావతి నిదర్శనంగా నిలుస్తుందని ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా వెలుగుందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి వసంతా మునిరత్నం, కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, ఐటిడిపి సురేష్ మీడియా కోఆర్డినేటర్, శ్రీపతి, సింగల్ విండో డైరెక్టర్ లు చిన్నబాబు, చండ్రాయుడు, రమణ, దేవేంద్ర రెడ్డి, శంకర, విజయ్ బబ్లు శ్రీనివాసులు ఈతకట్ట చంద్రశేఖర్, కూటమి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: