Sunday, 02 August 2026 04:33:40 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు

Date : 15 June 2026 07:21 PM Views : 98

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకల చెర్వు - జూన్ 15 : ములకలచెరువు మండలం గూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోటపల్లి గ్రామ త్రాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ చొరవతో గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో బోర్ మోటార్‌కు వెంటనే మరమ్మతులు చేయించారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు పాల్గొని మరమ్మతు పనులను పర్యవేక్షించారు. బోర్ మోటార్‌ను తిరిగి పనిచేసే విధంగా మరమ్మతులు చేయడంతో గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించబడింది

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను తక్షణమే పరిష్కరించిన జనసేన పార్టీ నాయకత్వానికి, గూడిపల్లి గ్రామ సెక్రటరీ విశ్వనాథ్‌కు, అలాగే గాలి సతీష్ కుమార్, తోట చంద్రమోహన్, సోమిశెట్టి శ్రీనివాసులు తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :