Friday, 31 July 2026 08:51:27 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మానవ అక్రమ రవాణా, మహిళలు–పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో చైతన్య ర్యాలీ

ర్యాలీ లో పాల్గొన్న పలు స్వచ్ఛంద సంస్థలు

Date : 01 February 2026 08:49 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఫిబ్రవరి 01 : మదనపల్లి సమీపం గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎన్‌.ఎస్‌.ఎస్ విభాగం ఆధ్వర్యంలో గ్రామజ్యోతి సొసైటీ (మదనపల్లి), ది మూమెంట్ గ్లోబల్ ఫౌండేషన్ (ముంబై) వారి సహకారంతో మానవ అక్రమ రవాణా, మహిళలు–పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మిట్స్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. కమల్ బాషా కార్యక్రమాన్ని ప్రారంభించారు., యూనివర్సిటీ నుండి అంగళ్ళు కూడలి వరకు ర్యాలీ సాగించి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి సొసైటీ ప్రతినిధి బి. శుభద్ర మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, చిన్నపిల్లల అపహరణ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలతో పాటు నకిలీ ఏజెంట్లను నమ్మి కువైట్, సౌదీ, ఖతార్ వంటి దేశాలకు వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముదివేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల అపహరణ, ర్యాగింగ్, సైబర్ నేరాలు వంటి ఘటనలు జరిగితే 100, 181, 1930, 1098 నంబర్లకు వెంటనే ఫోన్ చేయాలని సూచిస్తూ పోలీస్ శాఖ తక్షణ సహాయం అందిస్తుందని తెలిపారు. ర్యాలీ అనంతరం గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఎన్‌.ఎస్‌.ఎస్ ఆఫీసర్ పి.రాజేష్ మాట్లాడుతూ ర్యాలీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, కోఆర్డినేటర్ పి. రాజేష్, గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర, ముదివేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :