Thursday, 30 July 2026 10:41:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రాష్ట్రంలో వైకాపా పతనానికి పాతర వేసింది పవన్ కళ్యాణ్ - పసుపులేటి హరిప్రసాద్

తంబళ్లపల్లి లో భారీ జనసందోహం నడుమ జనసేన సభ్యత్వం నమోదు

Date : 22 February 2026 08:25 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 22 ః గత వైకాపా అవినీతి పాలనకు పాతర వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వారిధిగా నిలిచాడని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కొనియాడారు. ఆదివారం ఆయనతో పాటు మదనపల్లి ఇంచార్జ్ రాందాస్ చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, రాష్ట్ర చేనేత సంఘం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తంబళ్లపల్లె జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ లను జనసేన మండల నాయకులు సిద్ధమల్ రెడ్డి, ఎద్దుల నరసింహుల సారధ్యంలో వందలాది జనసైనికులతో తంబళ్లపల్లె పురవీధుల్లో భారీ ర్యాలీతో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాగాలతో హోరెత్తించారు. తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో జనసేన పార్టీ జెండా అశేష జనవాహిని మధ్య హరిప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ఎస్ ఎల్ వి కళ్యాణ మండపంలో జరిగిన బహిరంగ సభలో హరిప్రసాద్ మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఇంచార్జ్ సాయినాథ్ కు కార్యకర్తలు సహకరించాలని చెప్పడంతో హర్షద్వానాలు మిన్ను ముంటాయి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు పరుగులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోడెద్దుల పాలన రాష్ట్ర భవిష్యత్తు కోసం అలుపెరగని కృషి చేస్తున్నట్లు కొనియాడారు. అవినీతి వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పై నిప్పులు పోసుకుంటున్నట్లు విమర్శించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఈనెల 26 నుండి జనసేన సభ్యత్వం ఊపందుకోవాలని నియోజకవర్గంలో 25వేల సభ్యత్వం చేపడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తంబళ్లపల్లె కు రప్పించే బాధ్యత నాదేనని కార్యకర్తల ఈలల కేకల మధ్య ప్రకటించారు. తంబళ్లపల్లెలో జనసేన కార్యక్రమం విజయవంతం చేయడంలో సాయినాథ్ తో పాటు సిద్ధమల్ రెడ్డి, ఎద్దుల నరసింహులు, కార్యకర్తల కృషిని ప్రశంసించారు. రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతోందని మరో 15 ఏళ్లు కూటమి పాలన కొనసాగి రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు, మండలంలోని నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కరుణాకర్, మనోహర్, సురేష్, అరవింద్, బి మల్లికార్జున, నరేంద్ర నాయుడు, రఘు,రవి, కిరణ్, రమేష్ నాయక్, హసన్, శ్రీధర్, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, జనసేన,టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :