నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య&మదనపల్లి జిల్లా. మహిళల విద్యతోనే సమాజం వికసిస్తుందని నమ్మిన ఆధునిక భారత దేశ మొదటి మహిళ ఉపాద్యాయురాలు సావిత్రి బాయి ఫూలే -- కొనియాడిన వి ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు.పట్టణం లోని స్ధానిక బేబీ వెల్కంలో ఈ రోజు ఘనంగా సావిత్రి బాయి ఫూలే 195 వ జయంతి.అనంతరం వి ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు మీడియాతో మాట్లాడుతూ,ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే నేటి మహిళ విద్యాకు స్పూర్తిదాయకం అని పొదల నరసింహులు పేర్కొన్నారు.తాడిత,పీడిత ప్రజల ఆశజ్యోతి సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా చిత్తూరు బస్టాండ్ వద్ద గల బేబీ వెల్కం లో పొదల నరసింహులు ఆద్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో వి ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు, బీసీ వికలాంగుల అధ్యక్షులు మౌలాలి,బొగిటి కృష్ణమూర్తి,బీసీ మహిళ నాయకురాలు శ్రీదేవి, విన్నతమ్మ, ప్రభావతమ్మ, విష్ణు చైతన్య,ఉలసల మంజునాథ్,మల్లేష్ నాయక్ ,ఏఐటీయూసీ కృష్ణమూర్తి,కల్చర్ల నరసింహులు,రెడ్డి శేఖర, పురుషోత్తం,బీసీ నాయకుడు ఆనంద, బీసీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదల నరసింహులు మాట్లాడుతూ, మహిళలు విద్యా రంగంలోను అన్ని రంగాలలో సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే ఎన్నో పోరాటాలు చేశారని వివరించారు. భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని,ఆమె ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని వెల్లడించారు. ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యత, మహిళల హక్కుల కోసం పోరాటం చేయటం సామాజిక బాధ్యతగా భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడచి నవ నిర్మాణా వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాటం చేసిందని కొనియాడరు.ఆ మహనీయురాలు నాడు చేసిన మహిళ విద్యా పోరాటం నేటికి స్పూర్తిదాయకం అని వివరించారు.
Reporter
Namitha News