Friday, 31 July 2026 02:38:26 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

'ఉపాధి’ ని కాపాడుకుందాం - సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు

Date : 20 January 2026 06:21 PM Views : 303

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 'ఉపాధి’ ని కాపాడుకుందాం -- సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను నిరసించాలని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు కోరారు. ఇంటింటికీ ప్రచార కార్యక్రమం సందర్బంగా ఇళ్ల వద్దకెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మదనపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజి ఆర్‌ఎఎం జి చట్టం తీసుకు రావడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని కార్మికులకు పనులు లభించక వలసలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ, కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారం పడి క్రమంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటాయని తెలిపారు. విబిజి ఆర్‌ఎఎంజి పథకాన్ని రద్దు చేసి తక్షణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలంటున్న కూలీలు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :