నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబల్లపల్లి మండలంలోని ఎర్రసానిపల్లి వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ముట్రవారిపల్లి కు చెందిన జగన్ రెడ్డి అధ్యక్షుడుగా, ఎస్సీ సెల్ మెంబర్గా రమణలను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు రేపటి చౌడేశ్వర తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల అబ్జర్వర్ ఉమాపతి రెడ్డి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి, రమణ లో మాట్లాడుతూ తమకు ఈ పదవులు దక్కడానికి సహకరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా గణ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎంపిటిసి హరిత కరిముల్లా, సర్పంచ్ వీరభద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News