నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 13 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రామ్ ప్రియా.ఆర్ తమిళనాడు రాష్ట్రములోని అన్నామలై యూనివర్సిటీ వారు డాక్టరేట్ పట్టాను అందచేసినట్టు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. అన్నామలై యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగము నుండి పిహెచ్‌డి డిగ్రీ పొందినట్లు, అక్కడే పని చేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ మరియు రీసెర్చ్ సూపర్ వైజర్ డాక్టర్ ఎన్.సుగుణ పర్యవేక్షణలో "ఐడెంటిఫికేషన్ అఫ్ పుల్మనరీ డిసార్డర్ యూసింగ్ ఆప్టిమైజ్డ్ డీప్ లెర్నింగ్ మోడల్" అను అంశం పై చేసిన పరిశోధన కు గాను డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన అన్నారు. ఆర్.రామ్ ప్రియాను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు.
Reporter
Namitha News