Thursday, 30 July 2026 10:31:20 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ లో గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్

ముఖ్య అతిధిగా గా ప్రగ్యాషల్ క్లౌడ్ సొల్యూషన్స్ ఫౌండర్ & సిఈఓ యుగేంద్ర బాబు మరియు డైరెక్టర్ దీప

Date : 18 December 2025 09:51 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్ వర్కుషాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చెన్నై కు చెందిన ప్రగ్యాషల్ క్లౌడ్ సోలుషన్స్ కంపెనీ ఫౌండర్ మరియు సిఈఓ కే.యుగేంద్ర బాబు, డైరెక్టర్ పి.దీప మరియు బిజినెస్ ఆపరేషన్స్ ప్రతినిధి జి.అమృత సాయి పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఈఓ కే.యుగేంద్ర బాబు మాట్లాడుతూ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఇందుకోసం గూగుల్ క్లౌడ్ ఏఐ ప్లాట్‌ఫారమ్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు. గూగుల్ క్లౌడ్ ఏ ఐ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ (GCP) ద్వారా అందించబడిన కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ డెవలపర్‌లు, వ్యాపారాలు మరియు పరిశోధకులకు వారి అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఉపయోగపడుతాయని, ఈ టూల్స్ సులభంగా మరియు తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని ఆయన అన్నారు. కళాశాల పూర్వ విద్యార్ధి మరియు ప్రగ్యాషల్ క్లౌడ్ సోలుషన్స్ కంపెనీ డైరెక్టర్ పి.దీప మాట్లాడుతూ గూగుల్ క్లౌడ్‌తో ఏఐ పై పరిశోధనలు భవిష్యత్ సాంకేతిక పురోగతికి బలమైన పునాది వేసే ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందని అన్నారు. ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయడానికి మరియు ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలను పొందడానికి గూగుల్ క్లౌడ్ విత్ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఏం. గణేష్ రెడ్డి, విశ్వనాధ్ విద్యార్థులు మరియు తదితగ్గరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :