Sunday, 02 August 2026 04:34:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీపీఐ నాయకుల డిమాండ్

Date : 15 June 2026 10:18 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : మదనపల్లి పట్టణం కు జూన్ 20న జలధార భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లికి వస్తున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతంలో త్రాగునీరు, సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే హంద్రీనీవా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించి చెరువులను నింపే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో మదనపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, మదనపల్లి-రామసముద్రం రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించాలని కోరారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన మదనపల్లిలో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే నూతన ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆరోగ్యం, విద్య, రోడ్లు, తాగునీరు, ఉపాధి వంటి ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం భూమి పూజ భహిరంగ సభకే పరిమితం కాకుండా, మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన హామీలు, నిధుల కేటాయింపులు ప్రకటించాలి. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :