నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలోని మర్రిమాకులపల్లి పంచాయతీ తూగువారిపల్లి సమీపంలో నిర్మించిన నూతన దండు మారమ్మ తల్లి ఆలయం నిర్మాణం తో పాటు శిలా విగ్రహ, ధ్వజస్తంభ, బాలాలయ అష్ట బంధన, మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం అర్చకులు వేద పారాయణం, గణపతి పూజ, పుణ్యాహవచనం, గంగపూజ, ద్వారతోరణ, ధ్వజ కుంభాభిరాధనలు, ఉపకలశ పూజలు, నవగ్రహపూజ, మహా కుంభస్థాపన, బాల బింబి సంయోజన, అగ్ని ప్రతిష్ట, అరణి మధనం, బాలాగ్ని పూజా కార్యక్రమాలు విశేషాలు మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగాఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి దండు మారమ్మ నూతన ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆలయం దినదినాభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు
Reporter
Namitha News