Friday, 31 July 2026 01:30:56 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి

Date : 18 November 2025 05:02 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - అధికారులకు ఎగువ కొనకొంట్లవారిపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి - దుశ్చర్యకు ఒడిగట్టిన కొందరు స్థానికులు మదనపల్లె : గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యల నడుమ స్థానికంగా ఉన్న కొందరు మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతి,ఎగువకొనకుంట్ల వారిపల్లె గ్రామానికి దారి లేకుండా 20 రోజులుగా రోడ్డుకు అడ్డంగా మట్టితోలి దారిని పూర్తిగా మూసేశారు.దీంతో గ్రామంలోని 29 కుటుంబాలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా,విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా,రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలన్నా,వ్యవసాయ పొలాల నుంచి ధాన్యం,గడ్డి,వ్యవసాయ పనిముట్లు,తదితర వస్తువులు ఇళ్లకు,పొలాలకు తరలించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దారిని తెరవాలని అడిగితే స్థానికంగా గొడవలకు దిగి,దుర్భాషలాడుతూ,ఘర్షణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.వారిని ఎదిరించే శక్తి మాకు లేదని అధికారులకు,పోలీసులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిని మూసేసిన వారిపై చర్యలు తీసుకొని వెంటనే దారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.ఈ విషయమై తహశీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా పంచాయతీ సెక్రటరీ,వీఆర్వోలను సంఘటనా స్థలానికి పరిశీలనకై పంపామని,అయినా వారు దారికి అడ్డుగా వేసిన మట్టిని‌ తొలగించలేదన్నారు.కాబట్టి వారిపై కేసు నమోదు చేయమని తాలూకా పోలీసులను కోరడం జరిగిందన్నారు.‌మూసేసిన దారిని వెంటనే తెరవకపోతే కఠిన‌ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: