Thursday, 30 July 2026 12:30:52 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మెడికల్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి - సీపీఐ రామానాయుడు

Date : 08 February 2026 08:52 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఫిబ్రవరి 08 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తిరుమల లడ్డూ కల్తీ విషయం చూట్టూనే రాజకీయాలే చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు ఆరోపించారు ఆదివారం బి.కొత్తకోటలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మురళి తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఘోరంగా ద్రోహం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, రైతాంగ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపై స్పందించకుండా తిరుమల లడ్డూ కల్తీ రాజకీయ డ్రామాలకే పరిమితమవుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రజలకు జీవనాధారంగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించి, కూలీలకు 200 రోజుల పని కల్పించడంతో పాటు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ,తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పనులను కుదించటం ద్వారా గ్రామీణ పేదలను ఆకలిచావుల వైపు నెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని వారు హెచ్చరించారు. అలాగే, రాయలసీమ ప్రాంతం తీవ్ర నీటి కొరతతో అల్లాడుతుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తక్షణమే పూర్తి చేసి రాయలసీమ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంలో నియంత్రణ లేకుండా పెరిగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులోకి తేవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. , కరువుతో కష్టపడుతున్న ప్రాంతాల్లో సాగునీటి సమస్యల పరిష్కారానికి హంద్రీనీవా కాలువకు సబ్ చానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సబ్ చానల్ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల జీవన స్థితి మెరుగుపడుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజలను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని వారు హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సార్వత్రిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.జిల్లా వ్యాపారం సీపీఐ శ్రేణులు సమ్మెలో పాల్గొనాలని కోరారు.జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను తక్షణమే ప్రారంభించాలని కోరారు ఈ సమావేశంలో సీపీఐ తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ,మురళి,సీనియర్ నాయకులు యస్.బషీర్ ఖాన్,ఏఐటీయూసీ బి.కొత్తకోట మండల అధ్యక్షుడు యస్.తంబయ్యశెట్టి,గంగులప్ప,నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: