Friday, 31 July 2026 01:30:50 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జాతీయ స్థాయి లో బంగారు పతకం సాధించిన బాలుడిని సన్మానించిన ఆత్మకూరు ఆర్డీవో పావని

Date : 05 February 2026 09:19 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఫిబ్రవరి 05 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి పెన్కాక్ సిలాట్ అనే యుద్ధకళ పోటీలో నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొని జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఆర్డీవో బి.పావని గారు నేడు సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి మరియు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ఆహ్వానించి సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి ను అభినందిస్తూ ఘనంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతిని అందించారు. వీరితోపాటు వీరి కోచ్ సాయి ను మరియు విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్, జలీల్ , సయ్యద్ ఆయిషా బేగం మరియు ఈ విద్యార్థి చదివే మేధా స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య ను ఘనంగా సన్మానించారు

ఈ సందర్భంగా ఆర్డీవో బి పావని మాట్లాడుతూ ఎంతో కష్టతరమైన వైవిధ్యమైన యుద్ధకళ పోటీలో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించడం ఆత్మకూరుకు గర్వకారణం అని ఇటువంటి పతకాలు మరిన్ని సాధించి ఆత్మకూరుకు, నెల్లూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు నిలబెట్టాలని ఆర్డిఓ అభినందించారు. తమను అభినందించిన ఆర్డిఓ మేడం గారికి మొహిద్దిన్ ఖాదిరి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సత్కరించారు

ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డను ఘనంగా సత్కరించిన ఆర్డీవో గారికి రుణపడి ఉంటామని అలాగే అవార్డు అందుకున్న సందర్భంగా తమను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో తండ్రి జలీల్ పాఠశాల సిబ్బంది ఇందిరా, రహీం తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :