నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె రూరల్ అమ్మచెరువుమిట్ట కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార గుండా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్దానిక వైసిపి నాయకులు నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం పూజారులు శఠగోపం తలపై పెట్టి దీవెనలు అందించారు. అనంతరం భక్తులకు నిసార్ అహ్మద్ చేతులమీదుగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి విశేషమైన విశిష్టత ఉందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోటి పుణ్యాలు ఇస్తుందన్నారు. ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు అని ముక్కోటి ఏకాదశి అంటారని వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడనే ప్రతీతి అన్నారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉందన్నారు. హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారని అన్నారు. నిసార్ అహ్మద్ తోపాటు ఎస్.రమేష్, దండు రామాంజులు, కృష్ణారెడ్డి, రామమోహన్, మధు, కౌన్సిలర్లు శివ, ఈశ్వర్ నాయక్, పూజారి చరణ్, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి, మహేష్ కొత్తపల్లె, యూనస్, సాదిక్, యాసిన్, సమద్, పురాణం వెంకట్రమణ, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News