Friday, 31 July 2026 09:32:43 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో భవిష్యత్తులో ఇండస్ట్రీ లో యంత్రాలే కాకుండా మానవ మేధస్సు చర్చ

Date : 30 March 2026 05:40 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “ఇండస్ట్రీ 5.0 కోసం మానవ మరియు యంత్ర భవిష్యత్తును రూపకల్పన చేయడం” అనే అంశంపై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణేన్దు సిన్హా, ప్రొఫెసర్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ పరిశ్రమల్లో యంత్రాలు మాత్రమే కాకుండా, మనుషుల మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పరికరాల సహాయంతో పరిశ్రమలలో పనితీరు మరింత మెరుగుపడటమే కాకుండా, ఉత్పత్తి ప్రక్రియలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా మారుతాయని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 వేగం మరియు ఆటోమేషన్‌పై దృష్టి పెట్టగా, ఇండస్ట్రీ 5.0 మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుందని, కోబోట్స్ (Cobots) వంటి సాంకేతికతలతో మనుషులు మరియు యంత్రాలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించడం, డేటా అనలిటిక్స్ మరియు రోబోటిక్స్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సాధ్వినియిగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కోఆర్డినేటర్ జి.ముత్తు గురునాథన్, డాక్టర్ ఆర్. నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :