నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 09 : మదనపల్లె సమీపం లోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ నుండి 182 మంది బి.టెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రముఖ ప్రపంచ ఐటీ సేవల కంపెనీలలో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో ఉద్యోగాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ అద్భుతమైన విజయం విద్యార్థుల అంకితభావం, అధ్యాపకుల మార్గదర్శకత్వం, నాణ్యమైన సాంకేతిక విద్య మరియు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నైపుణ్య అభివృద్ధి ఎంతో దోహద పడిందని ఆయన అన్నారు. సి.ఎస్.ఈ - 72, సి.ఎస్.టి - 35, సి.ఏ.ఐ - 38, సైబర్ సెక్యూరిటీ - 9, డేటా సైన్స్ - 13, ఈ.సి.ఈ - 11, ఈఈఈ - 2 ఎం.టెక్-సి.ఎస్.ఈ - 2 విద్యార్థులు ఎంపిక అయినట్లు, వీరికి గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి 6.75 లక్షలు మరియు కనిష్టంగా 5.5 లక్షలు నుంచి 4 లక్షలు వరకు ఉంటుంది అని ఆయన అన్నారు. ఎంపిక అయిన విద్యార్థులను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రోఛాన్సుల్లేర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్, డీన్లు, విభాగాధిపతులు మరియు ప్లేసెమెంట్ ఆఫీసర్ లు తదితరులు అభినందనలు తెలియజేసారు.
Reporter
Namitha News