నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రానికి ( Race ) రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ హెన్ టెన్ హాండ్స్ మెంట్ ద్విచక్ర వాహనం ఒకటి మరియు ఫోర్ వీలర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాలలో విపత్తులు సంభవించినప్పుడు మరియు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు లేదా నెట్వర్క్ లేని ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడుతుంది. మదనపల్లి పట్టణ ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మరియు పాదయాత్రలో కమ్యూనికేషన్ చేయటానికి వీలుగా ఉంటుంది. నెట్వర్క్ లేని ఏరియా ప్రాంతాల్లో పది కిలోమీటర్స పరిధిలో మాచారాన్ని తొందరగా చేరవేసేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. వాహనాలకి పూజ చేసి పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ ధీరజ్కునుబిల్లి . ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డి.ఎస్.పి మహేంద్ర, టూ టౌన్ సిఐ రాజారెడ్డి, వన్ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ, కమ్యూనికేషన్ సిఐ మురళీధర్ రాజు, ఆర్ ఐ పెద్దయ్య, తాలూకా సిఐ కళా వెంకటరమణ, సిఐ చంద్రశేఖర్ ఎస్ ఐ గాయత్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News