నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తో కలసి పట్టణం లోని మటన్,చికెన్ షాపులు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన మాంసం పాడైపోయినట్లు అధికారులు గుర్తించారు.ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని షాపు యజమానులను హెచ్చరించారు.
Reporter
Namitha News