Friday, 31 July 2026 10:47:38 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అధికార గర్వంతో విర్రవీగితే మూల్యం చెల్లించుకోక తప్పదు

అవినీతి చేసినట్లు నిరూపిస్తే ప్రమాణానికైనా సిద్ధమే - టిడిపి నాయకులకు వైసిపి కౌన్సిలర్లు సవాల్

Date : 26 January 2026 07:50 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అధికార గర్వంతో విర్రవీగితే మూల్యం చెల్లించుకోక తప్పదు - అవినీతి చేసినట్లు నిరూపిస్తే ప్రమాణానికైనా సిద్ధమే - టిడిపి నాయకులకు వైసిపి కౌన్సిలర్లు సవాల్ మదనపల్లె : అధికార గర్వంతో విర్రవీగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని,మదనపల్లె మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు కేవలం ప్రజాధనాన్ని అభివృద్ధికి ఉపయోగించాలనే ఆలోచనతోనే మున్సిపాలిటీకి చెందిన జనరల్ ఫండును 40 కోట్లు తిరిగి తెప్పించాలని గౌరవంగానే అడగడం జరిగిందని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు తెలిపారు.సోమవారం స్థానిక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి మున్సిపల్ కౌన్సిలర్లు,పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్ లో చర్చించి తీర్మానించడం తమ బాధ్యత అని గుర్తుచేశారు.కౌన్సిల్ తీర్మానం చేసిన అభివృద్ధి పనులకు గత 18 నెలల కాలంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమిపూజలు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్న తాను ఎక్కడ ప్రశ్నించిన దాఖలాలు కానీ,అడ్డుపడిన సందర్బం కానీ లేదని గుర్తు చేశారు.మదనపల్లి మున్సిపాలిటీలో పురప్రజలు కట్టిన పన్నులు 40 కోట్ల జనరల్ ఫండ్ కూటమి ప్రభుత్వం వాడు కోవడం జరిగిందని తిరిగి,ఆ నిధులను మున్సిపాలిటీ అభివృద్ధికి తెప్పించాలని కోరిన సమయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కౌన్సిల్ సభ్యుల సాక్షిగా తాము 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి సిద్ధమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ,ఆరోజు అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరిస్తే సన్మానించడానికి సిద్ధమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.కాగా ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ కాల పరమితి మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రజల గొంతుకు వినిపించి పుర ప్రజల మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం కోసం ప్రభుత్వం వాడుకున్న మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులను తిరిగి తెప్పించాలని కౌన్సిల్లో వైస్ చైర్మన్ జింకా చలపతి అడగడం జరిగిందని,అయితే శాసనసభ్యులు షాజహాన్ బాషాను ఎక్కడా అగౌరవపరిచిన పరిస్థితి లేదన్నారు.ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్ నందు ఎక్స్ ఆపిసియో సభ్యులుగా ప్రవేశించి ఏడాది గడుస్తోందని,ఈ పరిస్థితుల్లో కౌన్సిల్ హాల్,కౌన్సిల్ సభ్యులందరితో కలిసి ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చమని గౌరవంగా అడిగామే కానీ తప్పుపట్టిన పరిస్థితి కాదన్నారు.ఎక్కడైనా అవమానకరంగా మాట్లాడి ఉంటే తాను రాజీనామాకు సిద్ధమని కౌన్సిలర్ ఖాజా ప్రకటించారు.తమ కౌన్సిల్ కాలంలో ఎక్కడ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవని దీనిపై తరిగొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారానికి తాము సిద్ధమని కౌన్సిలర్ రాజేష్ ప్రకటించగా,మీరు గడిచిన 18 నెలల కాలంలో అవినీతి దూరంగా వున్నామని ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.తాము అసభ్యకరమైన పదజాలం వాడామనే చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.ముఖ్య మంత్రి మదనపల్లె జిల్లా చేస్తామని హామీ ఇస్తే,అది అమలు చేయకపోగా అన్నమయ్య జిల్లాను మాత్రమే కొనసాగిస్తూ జిల్లా కేంద్రంగా మాత్రమే మదనపల్లి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.మదనపల్లి జిల్లాను అధికారికంగా ప్రకటిస్తే టిడిపి నాయకుల కాళ్లు కడిగి,నెత్తిన నీళ్లు చళ్లుకుంటామన్నారు.ప్రస్తుతం మదనపల్లి పట్టణంలో గతంలో ఉన్న దానికి భిన్నమైన సంస్కృతి,సంప్ర దాయాలను తీసు కొస్తున్నారని ఇది వారి పార్టీకి ప్రజలకు మంచిది కాదని హితవు పలికారు.తాము ఎక్కడ కానీ పార్టీ గురించి గానీ నాయకుల గురించి గానీ పొరపాటుగా మాట్లాడలేదని,ఎమ్మెల్యే మరియు ఆ పార్టీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడి ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజాం,కౌన్సిలర్లు ఖాజా,రాజేష్,షబానా,సుగుణ ఆంజనేయులు,రేణుక,వెంకట శివారెడ్డి,రామిశెట్టి శివయ్య,శ్రీనివాసులు,ప్రసాద్ బాబు,పాల్ చంద్రశేఖర్,ఎస్వి రమణ,మహిళా నాయకురాలు మేరీ,జయశ్రీ రెడ్డి,నాగమణి,వైఎస్ఆర్సిపి నాయకులు రఫీ,చరణ్,శ్యామల,అమ్మజాన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: