Friday, 31 July 2026 07:49:50 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ విదేశాలలో ఉన్నత విద్య, స్కాలర్ షిప్ తదితర అంశాలపై అవగాహనా సదస్సు

Date : 23 February 2026 05:21 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు స్టూడెంట్ వెల్ఫేర్ సెల్ ఆధ్వర్యంలో “విదేశాలలో ఉన్నత విద్య కార్యక్రమాల కోసం యూనివర్సిటీ వారి ప్రైవేట్ స్కాలర్‌షిప్స్” అనే అంశంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతికి చెందిన ఎమ్.ఎస్ అబ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ పురాణం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్‌షిప్ లు అందిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని, అలాగే వీసా డాక్యుమెంటేషన్, ఇంటర్వ్యూ సన్నాహాలు తన కన్సల్టెన్సీ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్‌లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి. అథాహర్ సమీనా ఖాన్, రాగ దీప్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: