Thursday, 30 July 2026 07:19:02 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిడిపి కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లును పరిశీలించిన మంత్రులు

పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి క్షేత్రస్థాయిలో అంగరంగ వైభవంగా మహానాడుని నిర్వహిస్తున్నాం - హోం మంత్రి అనిత

Date : 26 May 2026 07:26 PM Views : 68

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - మే 26 : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను హోం మంత్రి అనిత, మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ఈసారి మహానాడు పండుగ హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మహానాడును హైబ్రిడ్ రూపంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని తెలిపారు. మొదట మహానాడును నెల్లూరులో నిర్వహించాలని భావించినప్పటికీ, ఈసారి మరింత వైభవంగా క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. లోకేష్ నాయకత్వంలో పార్టీకి అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, టెక్నాలజీని వినియోగించి గ్రామ, నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా మహానాడును వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొంటూ మహానాడును వీక్షిస్తున్నారని వెల్లడించారు. పొదుపు చర్యలతో పాటు పార్టీకి కొత్త దిశను చూపించే విధంగా మహానాడు నిర్వహిస్తున్నామని, నవశకానికి నాంది పలికే తొలి అడుగుగా ఈ మహానాడు నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈసారి “స్త్రీ శక్తి” నినాదంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యంగా మహానాడు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :